అనంతపురం జిల్లాలో ఆకతాయికి బుద్ధి చెప్పిన పోలీసులు
అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఈవ్ టీజింగ్ కు పాల్పడుతున్న ఓ ఆకతాయికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. డిగ్రీ చదువుతున్న ఓ యువతిని... ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలంటూ ఈ ఆకతాయి గత ఏడాదిగా వెంటపడి వేధిస్తున్నాడు. తన ప్రతిపాదనకు ఆ యువతి ఒప్పుకోకపోవడంతో చివరకు చితకబాదాడు. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు ఆకతాయిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడ్ని తాడిపత్రి బస్టాండ్ దగ్గర నడి రోడ్డు మీద బెల్టుతో వాయించి అమ్మాయికి క్షమాపణలు చెప్పించారు. ఆడవాళ్లంతా సోదరీమణులని ప్రమాణం చేయించారు. తరువాత ఆకతాయిపై నిర్భయ చట్టంకింద కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. ఇకపై ఎవరైనా అమ్మాయిల్ని వేధిస్తే ఇదే రీతిన బుద్ధి చెబుతామని పోలీసులు హెచ్చరించారు.